విశాక ఇండస్ట్రీస్​ లాభం రూ.118 కోట్లు

విశాక ఇండస్ట్రీస్​ లాభం రూ.118 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: తక్కువ ధరల్లో పర్యావరణ అనుకూల బిల్డింగ్​ మెటీరియల్స్​ తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ విశాక ఇండస్ట్రీస్​ ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022 ఫైనాన్షియల్​ ఇయర్​లో రూ.118.53 కోట్ల లాభం సాధించింది. అంతకుముందు ఫైనాన్షియల్​ ఇయర్​ లాభం రూ.110.65 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. రెవెన్యూ రూ.1,146 కోట్ల నుంచి రూ.1,415.78 కోట్లకు, ఇబిటా రూ.202.06 కోట్ల నుంచి రూ.209.94 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్​ 15 శాతం నుంచి 18 శాతానికి, పీఏటీ మార్జిన్​ 8 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. 

క్యూ4లో రూ.421 కోట్ల ఆదాయం

ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో కంపెనీకి రూ.30.12 కోట్ల లాభం వచ్చింది. 2021 మార్చి క్వార్టర్​లో రూ.30.88 కోట్ల లాభం వచ్చింది. ఇదే కాలంలో ఆదాయం రూ.354.15 కోట్ల నుంచి రూ.420.63 కోట్లకు పెరిగింది. ఇబిటా 55.23 కోట్ల నుంచి రూ.55.21 కోట్లకు తగ్గింది. ఇబిటా మార్జిన్​ 16 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది. ఫలితాలపై విశాక జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ వంశీ గడ్డం మాట్లాడుతూ ‘‘మా టీమ్​ కమిట్​మెంట్​తో కష్టపడి పనిచేయడం వల్ల నాలుగో క్వార్టర్​లో ఫలితాలు బాగా వచ్చాయి. దేశవిదేశాల్లో చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టాం. కరోనా ఇబ్బందులను అధిగమించాం. మా ప్రొడక్టులకు డిమాండ్​ పెరిగింది. యూపీలోని రాయ్​బరేలీలో కొత్త అస్​బెస్టాస్​సిమెంట్​ డివిజన్​ను మొదలుపెట్టాం. లక్ష ఎంటీపీఏ కెపాసిటీ గల అదనపు లైన్​ కూడా మొదలైంది. తమిళనాడులోని ఉడుమాళ్​పేటలో వీబోర్డ్​ మాన్యుఫాక్చరింగ్​ యూనిట్​ను స్టార్ట్​ చేశాం. జనవరి నుంచే ఇక్కడ ప్రొడక్షన్​ మొదలయింది. పర్యావరణ అనుకూల బిల్డింగ్​ మెటీరియల్స్​కు దేశమంతటా మంచి గిరాకీ ఉంది”అని ఆయన వివరించారు.