విశాక ఇండస్ట్రీస్ లాభం రూ.52.37 కోట్లు

విశాక ఇండస్ట్రీస్ లాభం రూ.52.37 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  విశాక ఇండస్ట్రీస్ నికరలాభం గత ఏడాది జూన్​ క్వార్టర్​తో పోలిస్తే 400 శాతానికిపైగా పెరిగి రూ.52.37 కోట్లకు చేరుకుంది. గత జూన్​క్వార్టర్​లో రూ.10.48 కోట్ల లాభం వచ్చింది. 

ఆదాయంలో బలమైన పెరుగుదల, ఎక్స్​పెన్షనల్​ఐటెం ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. కంపెనీ మొత్తం ఆదాయం కంపెనీ మొత్తం ఆదాయం రూ.506.87 కోట్లకు పెరిగింది. ఇది జూన్ 2024 క్వార్టర్​లో ఉన్న రూ.458.21 కోట్ల కంటే భారీగా పెరిగింది. 

పన్నుకు ముందు లాభం గత ఏడాది రూ.14.25 కోట్ల నుంచి రూ.64.99 కోట్లకు గణనీయంగా పెరిగింది. ఎర్నింగ్​పర్​షేర్​ జూన్ 2024 క్వార్టర్​లో ఉన్న రూ.1.21 నుంచి రూ.6.06కి చేరుకుంది. ఈ క్వార్టర్​లో విశాక ఇండస్ట్రీస్ మంచి వృద్ధిని సాధించింది. ఆదాయం, లాభాలు రెండూ ఆకట్టుకునే స్థాయిలో పెరిగాయి.