మొదలైన విశాల్, హరి మూవీ.. ఈసారి మాస్ ఫీస్ట్ గ్యారంటీ

మొదలైన విశాల్, హరి మూవీ.. ఈసారి మాస్ ఫీస్ట్ గ్యారంటీ

సింగమ్(Singam) సిరీస్ తో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు తమిళ దర్శకుడు హరి(Hari). ఆయన తాజాగా హీరో విశాల్(Vishal) తో తన కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు కు సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే చెన్నై లో జరిగాయి. 

ఇక ఈ ప్రాజెక్టు కు సంబందించిన రెగ్యులర్ షూటింగ్ జులై 15 శనివారం నుండి మైదలైంది. ఇదే విషయాన్నిమేకర్స్. అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు హరి గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రానుందని సమాచారం. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతం అందిస్తున్నారు. ఇక్కడ మరి విశేషం ఏంటంటే.. హీరో విశాల్ కు దేవి సంగీతం ఆడించడం ఇదే మొదటిసారి.

ఇక ఇప్పటికే హరి అండ్ విశాల్ కాంబోలో పూజ(Puja) సినిమా వచ్చింది. శృతి హాసన్(Shruthi haasan) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి విశాల్ కెరీర్ లో 34వ సినిమా గా వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది అనేది చూడాలి.