ఒంటరిగా వస్తోన్న విశాల్ మార్క్ ఆంటోనీ.. థియేటర్స్లో చూడటానికి ఐదు కారణాలు

ఒంటరిగా వస్తోన్న విశాల్ మార్క్ ఆంటోనీ.. థియేటర్స్లో చూడటానికి ఐదు కారణాలు

టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా శుక్రవారం వచ్చిందంటే సినిమాల పండుగే కనిపిస్తుంది. రేపు శుక్రవారం (సెప్టెంబర్ 14న) థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నది కేవలం ఒకే ఒక్క సినిమా. ఏ వారం అయినా రెండు లేదా మూడు సినిమాల వరకు.. ప్రతి శుక్రవారం మూవీస్ రిలీజ్ అవుతూ..పోటీ పడుతూ ఉంటాయి. రేపు రిలీజ్ కాబోతున్న ఆ ఒక్క సినిమా ఏంటో చూద్దాం.

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మార్క్‌ ఆంటోనీ(Mark Antony) .ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల్లోనే నటించిన విశాల్.. ఈసారి మార్క్ ఆంటోని అనే డిఫరెంట్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీని చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. 

థియేటర్స్లో చూడటానికి ఐదు కారణాలు:  

టైమ్ ట్రావెల్, సైన్స్‌‌ ఫిక్షన్‌‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌లో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపిస్తున్నాడు. గ్యాంగ్‌‌స్టర్స్ చేతికి టైమ్ మిషన్ చిక్కితే ఏమవుతుంది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌. భవిష్యత్తు నుంచి తండ్రి ఆంటోనిని వెతుక్కుంటూ గతంలోకి వస్తాడు మార్క్. ఈ రెండు క్యారెక్టర్స్‌‌ను విశాల్ పోషించాడు. గ్యాంగ్‌‌స్టర్స్‌‌ పాత్రల్లో విశాల్, ఎస్‌‌.జె.సూర్య(SJ Suryah) రెండు డిఫరెంట్ టైమ్‌‌ లైన్స్‌‌లో యంగ్‌‌గా, ఏజ్డ్‌‌గా కనిపించారు. మొదట్లో ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌‌ అయిన..  వీళ్ల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, టైమ్ మిషన్‌‌ ద్వారా వీళ్లు ఏం చేశారనేది ఆసక్తి రేపుతోంది.

Also Read :- కోలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్.. ఆ స్టార్‌ హీరోలకు రెడ్ కార్డు

డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రంలో విభిన్న యాక్షన్ సన్నివేశాల కోసం నలుగురు వేర్వేరు ఫైట్ మాస్టర్లను ఉపయోగించారు.  పీటర్ హెయిన్స్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కనల్‌ కన్నన్‌, దినేశ్‌ సుబ్బరాయన్‌ ఫైట్స్‌ సినిమాకు మెయిన్ హైలెట్‌గా ఉండబోతున్నట్లు.. ఒక్కో ఫైట్..ఒక్కో స్టైల్ ఉంటుందని టాక్. కాబట్టి, ఈ మూవీ ఖచ్చితంగా అధిక్ రవిచంద్రన్ నుండి వస్తోన్న పక్కా యాక్షన్ ప్యాక్డ్ చిత్రం అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. 

హీరోయిన్స్ గా అభినయ, రీతూ వర్మ నటిస్తున్నారు. వేర్వేరు టైమ్ లైన్స్ తో  హీరో విశాల్  తో కనిపిస్తున్నారు. అలాగే ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్‌‌గా నటిస్తోంది.  అంతే కాకుండా జూనియర్ ససిల్క్ స్మిత అయినా విష్ణుప్రియా గాంధీ.స్పెషల్ సాంగ్ చేస్తుంది.ఈ సాంగ్ కోసం సిల్క్ స్మిత ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.  

ఈ మూవీలో సునీల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుండటంతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా రజినీకాంత్ బాక్సాపీస్ హిట్ మూవీ జైలర్ లో కూడా నటించాడు. ఇక మార్క్ ఆంటోనీ నుంచి సునీల్ డిఫెరెంట్ క్యారెక్టర్ ను చూస్తారని విశాల్ తెలిపారు.  

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కంపోస్ చేసిన సాంగ్స్తో వావ్ అనిపించుకున్నారు. ముఖ్యంగా రిలీజైన టీజర్, ట్రైలర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్కి గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది.. 

ఈ మధ్య కాలంలో విశాల్ నుంచి సరైన హిట్ ఒక్కటీ లేకపోవడంతో ఫ్యాన్స్ డిస్సపాయింట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మార్క్ ఆంటోనీ మూవీకి.. ఏ మూవీ కూడా పోటీ లేకపోవడంతో..పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తమిళనాడు లో ఈ మూవీ దాదాపు 600 స్క్రీన్లలో రిలీజ్ కానుంది. అలాగే విశాల్ మూవీ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ లో జోష్ క్రియేట్ చేశేషున్నారు.  ఇక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 15న మార్క్‌ ఆంటోనీ రిలీజ్ కాబోతుంది.