
సాయి ధన్సిక, విశాల్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సాయి ధన్సికనే ప్రకటించింది. ఆగస్ట్ 29, 2025న తమ పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నామని ఈ జంట తెలిపింది. పెళ్లి తర్వాత కూడా సాయి ధన్సిక సినిమాల్లో నటిస్తుందని విశాల్ ప్రకటించాడు. సాయి ధన్సిక తాజా తమిళ సినిమా యోగిదా సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని, పెళ్లి తేదీని విశాల్, సాయి ధన్సిక ప్రకటించారు.
విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని సాయి ధన్సిక చెప్పింది. ఈ ఇద్దరికీ కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మనసులు కలిశాయి. మనువు కుదిరింది. ‘రజినీకాంత్’ కబాలి సినిమా చూసినవాళ్లకు సాయి ధన్సిక తెలిసే ఉంటుంది.
#SaiDhanshika:
— AmuthaBharathi (@CinemaWithAB) May 19, 2025
"Enna Baby Solliralama😀❓. Me & #Vishal going to marry on Aug 29th. We recently started talking with each other & got into love. I just want Vishal to be happy & I love you🫶"pic.twitter.com/F1j8bw3XA5
‘కబాలి’ సినిమాలో రజినీ కూతురి పాత్రలో ఆమె నటించింది. తెలుగులో ‘షికారు’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ సినిమాల్లో నటించింది. విశాల్ వయసు 47 సంవత్సరాలు. ధన్సిక వయసు 35 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 12 సంవత్సరాలు. విశాల్కు గతంలో అనీషా అల్లారెడ్డితో ఏప్రిల్ 2019న నిశ్చితార్థం జరిగింది. కారణం విషయంలో స్పష్టత లేదు గానీ నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే విశాల్, అనీషా పెళ్లి ప్లాన్ను రద్దు చేసుకున్నారు.
ALSO READ | పెళ్లికి రెడీ అయిన విశాల్.. ఈ హీరోయిన్ గుర్తుందా..? వధువు ఈమెనేనని టాక్..!