కన్నప్ప కామిక్ సిరీస్.. మూడో ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ విడుదల

కన్నప్ప కామిక్ సిరీస్.. మూడో ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ విడుదల

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. జూన్‌‌‌‌‌‌‌‌ 27న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ బజ్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేశాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి  తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కామిక్ సిరీస్‌‌‌‌‌‌‌‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మూడో ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఈ చివరి ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని  ప్రయాణాన్ని ఇందులో చూపించారు. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథకు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్ అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.