క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోయాడు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో  చనిపోయాడు

ఈ మధ్య కాలంలో గండెపోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వ్యాయామం చేస్తూ..నడుస్తూ హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కూర్చుని మాట్లాడుతుండగానే ప్రాణాలు గాల్లో కలిసి పోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా జగిత్యాల జిల్లాలో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. 

మల్లాపూర్ మండల కేంద్రంలో  కేటీఆర్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో విషాదం నెలకొంది. మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ సర్పంచ్ కొంపెల్లి సరోజన కొడుకు విష్ణు(35)  క్రికెట్ ఆడుతుండగా గుండె పోటుకు గురయ్యాడు. అతన్ని  హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందాడు. 

గుండెపోటు పదం వినగానే ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  పూర్తి ఆరోగ్యంగా ఉన్న కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. దీంతో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.