​నేషనల్ అవార్డు​ గ్రహీతకు సన్మానం

​నేషనల్ అవార్డు​ గ్రహీతకు సన్మానం

నిజామాబాద్, వెలుగు: రెడ్​ క్రాస్​ సేవా కార్యక్రమాలతో జాతీయ అవార్డుకు ఎంపికైన తోట రాజశేఖర్​ను కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు సోమవారం శాలువాతో సన్మానించి పూలబొకే అందించారు.  అదనపు కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్​, డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ, రెడ్​క్రాస్​ జిల్లా ప్రెసిడెంట్​ బుస్స ఆంజనేయులు, టీఎన్జీవోల సంఘం జిల్లా ప్రెసిడెంట్ సుమన్​, జనరల్​ సెక్రటరీ శేఖర్ ఉన్నారు.

ఏడాదికి మూడు సార్లు 

తోట రాజశేఖర్ ఇప్పటి వరకు 84 సార్లు రక్తదానం చేశారు. బోధన్​లోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో 1990లో నిర్వహించిన బ్లడ్​ డొనేషన్​ క్యాంప్​లో 18 ఏండ్ల వయస్సులో రక్తదానం చేశారు. తర్వాత ఏడాదికి నాలుగుసార్లు బ్లడ్​ డొనేషన్​ చేస్తున్నారు.  సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్​ జేపీ నడ్డా నుంచి 11న ఢిల్లీలో అందుకోవాల్సిన అవార్డు​  సిందూర్ ఆపరేషన్​ వల్ల క్యాన్సల్ అయింది.  ఎడపల్లి మండలం ఏఆర్​పీ క్యాంప్​ వాస్తవ్యుడైన తోట రాజశేఖర్ నిజామాబాద్​ ఎన్పీడీసీఎల్​లో ఏడీఈగా పనిచేస్తున్నారు. 

కలెక్టర్​కు ఆహ్వాన పత్రిక అందజేత 

నందిపేట, వెలుగు : నందిపేట మండల కేంద్రంలోని రామ్​నగర్​ కాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఈనెల14,15,16 వ తేదీలలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనాలని సోమవారం ఆలయకమిటీ సభ్యులు కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతుకు ఆహ్వాన పత్రిక అందజేశారు.