బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పి స్కాం.. కాంగ్రెస్ సర్కార్ లో బయటపడ్డ నిజాలు

బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పి స్కాం.. కాంగ్రెస్ సర్కార్ లో బయటపడ్డ నిజాలు

 నకిలీ పత్రాలను సృష్టియించి కంపనీలను సొంతం చేసుకుంటున్న ఘరానా కేటుగాడు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. NRI విష్ణు వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సూపర్ సర్పేసస్ కంపనీతో పాటు మరో రెండు కంపనీలను మోస పూరితంగా లాకున్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో BRS , YCP పార్టీలో పెద్దల పేర్లు చెప్పి కంపనీ పెట్టుబడులు పెట్టించి, ఆ కంపిణీలనే మోస పూరితంగా కాజేస్తున్నాడు విష్ణు వర్ధన్ రెడ్డి. 

అయితే ఇప్పుడు A1 విష్ణువర్ధన్ రెడ్డి చాయిజ్ ఫుడ్ ఇండియా ప్రెయివేట్ లిమిటెడ్ , హోగర్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను నకిలీ పత్రాలు, నకిలీ డిజిటల్ సంతకాలు ద్వారా పలుకుబడి ఉపయోగించి కాజేశాడు. వీటి విలువ కోట్లు రూపాయల ఉంటుందని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో పెద్దలు పేర్లు చెప్పి.. బెదిరించి.. బాధితులపైనే కేసులు పెట్టి జైలుకు పంపించాడని బాధితులు తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలతో  కేసులు రీ ఓపెన్ చేసి పోలీసులు విచారణ చేయగా అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. విష్ణు వర్ధన్ రెడ్డి చేతిలో మోసపోయిన వారు ఇంకా చాలా మంది ఉండవచ్చని తమకు న్యాయం చేయాలని భాదితులు వాపోతున్నారు.