హైదరాబాద్ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలి: GHMC కమిషనర్

హైదరాబాద్ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలి: GHMC కమిషనర్

ఇబ్రహీంపట్నం, వెలుగు: పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్లలో డిసెంబర్ 29 నుంచి 31 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మూడో రోజు బుధవారం ఆదిబట్ల, కొంగర కలాన్, బొంగ్లూర్ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను కర్ణన్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్​ను క్లీన్​ సిటీగా తీర్చిదిద్దాలన్నారు. రానున్న రోజుల్లో చెరువులు, నాలాలు, ఫుట్​పాత్​లు, పార్కుల క్లీనింగ్, సీ అండ్ డీ వ్యర్థాల తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో  జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి, డీఈఈ స్వర్ణ కుమార్, ఏఈఈ యోగేశ్​రెడ్డి, శానిటరీ ఇన్​స్పెక్టర్లు భాస్కర్, వనిత తదితరులు పాల్గొన్నారు.