టెట్ రాసే టీచర్లకు ‘ఓడీ’ ఇవ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

టెట్ రాసే టీచర్లకు ‘ఓడీ’ ఇవ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ

హైదరాబాద్, వెలుగు: జనవరి 3 నుంచి జరగబోయే టీజీ టెట్ పరీక్షలకు హాజరయ్యే ఇన్​సర్వీస్ ​టీచర్లకు ఆన్​డ్యూటీ (ఓడీ) సదుపాయం కల్పించాలని టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. టీచర్లకు పరీక్షా కేంద్రాలను సొంత జిల్లాల్లో గానీ, వారు పనిచేసే ప్రాంతానికి దగ్గరలో గానీ కేటాయించాలన్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​కు ఆయన లేఖ రాశారు.