నల్గొండ డీసీసీ అధ్యక్షుడికి అవమానం.. వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

నల్గొండ డీసీసీ అధ్యక్షుడికి అవమానం.. వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

 

  •     నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో ఘటన
  •     కావాలనే కుట్ర చేస్తున్నారన్న కైలాశ్‌‌‌‌ నేత

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌కు హాజరైన డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌‌‌‌నేతను వేదిక మీదికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... తుమ్మలపల్లి గ్రామంలో బుధవారం జరిగిన ఓ కాంగ్రెస్‌‌‌‌ నేత దశదినకర్మకు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌‌‌‌ నేత హాజరయ్యారు. కొద్దిసేపటికి శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి, మాజీమంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌‌‌‌రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌‌‌‌రెడ్డి అక్కడికి రావడంతో వారిని కైలాశ్‌‌‌‌ నేత ఆహ్వానించారు. 

కొద్దిసేపటికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి సైతం వచ్చారు. దీంతో కాంగ్రెస్‌‌‌‌ నాయకుడి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు మంత్రితో పాటు గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి, సర్వోత్తమ్‌‌‌‌రెడ్డి తదితర నేతలు వేదిక పైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌‌‌‌ నేత సైతం వేదిక పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీఐ ఆదిరెడ్డి అడ్డుకొని, వేదిక పైకి వెళ్లొద్దని చెప్పారు. 

దీంతో ‘ప్రభుత్వ కార్యక్రమం కానప్పటికీ నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకున్నారు’ అని కైలాశ్‌‌‌‌ ప్రశ్నించగా.. పోలీస్‌‌‌‌ ఆఫీసర్లు కొంత అతిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా, తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని, పోలీసులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌‌‌‌నేత ఆరోపించారు.