న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం.. ఖురాన్పై ప్రమాణం చేసిన మమ్దానీ

న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం.. ఖురాన్పై ప్రమాణం చేసిన మమ్దానీ

న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దానీ గురువారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మాన్‌హట్టన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో ఈ ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్ద నగరమైన, విలాసవంతమైన న్యూయార్క్ సిటీకి మొదటి ముస్లిం మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఖురాన్ పై చేయి ఉంచి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

ఇది నిజంగా జీవిత కాలంలో లభించే ఒక అరుదైన గౌరవం, ప్రత్యేక సందర్భం అని మమ్దానీ తన ప్రసంగంలో చెప్పారు. ఈ వేడుకను ఆయన రాజకీయ మిత్రురాలు లెటిటియా జేమ్స్ నిర్వహించారు.మేయర్‌గా తన మొదటి వ్యాఖ్యలలో, మమ్దానీ తన కొత్త రవాణా శాఖ కమిషనర్ మైక్ ఫ్లిన్ నియామకాన్ని ప్రకటించారు.

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం గానూ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగానూ జోహ్రాన్ మమ్దానీ నిలిచారు. ఆయన తండ్రి మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మమ్దానీ ఉగాండా జాతీయుడు. తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీరానాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కాగా, మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో మమ్దానీకి 50.40 శాతం ఓట్లు (10,36,051) పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. 

ప్రధాన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోకు 41.6 శాతం ఓట్లు (8,54,995) వచ్చాయి. దాదాపు 1.81 లక్షల ఓట్ల మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 7.10% (1,46,137) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 56 ఏండ్లలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాను జోహ్రాన్ చిత్తుగా ఓడించడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలినట్టయింది.