వర్కర్ టు ఓనర్‌‌‌‌ స్కీమ్ ..సంక్రాంతిలోగా అమలు చేయాలి

వర్కర్ టు ఓనర్‌‌‌‌ స్కీమ్ ..సంక్రాంతిలోగా అమలు చేయాలి
  • లేకుంటే 10 వేల మంది కార్మికులతో సిరిసిల్లలో ధర్నా చేస్తా
  • బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ హెచ్చరిక

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ‘సిరిసిల్ల నేత కార్మికులకు సంక్రాంతి లోగా వర్కర్‌‌‌‌ టు ఓనర్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను అమలు చేయాలి లేదంటే సిరిసిల్ల అపెరల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఎదుట 10 వేల మంది నేత కార్మికులతో ధర్నా చేస్తా’ అని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ హెచ్చరించారు. బుధవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన స్థానిక తెలంగాణ భవన్‌‌‌‌లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం అపెరల్‌‌‌‌ పార్క్‌‌‌‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

సిరిసిల్ల నేత కార్మికులను ఆదునేందుకు గత ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. సిరిసిల్ల నేతన్నల ఆత్యహత్యలను ఆపేందుకు రూ.3,400 కోట్లతో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించామని గుర్తు చేశారు. నేత కార్మికులను ఓనర్లను చేసేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో వర్కర్‌‌‌‌ టు ఓనర్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను ప్రవేశపెట్టి రూ. 400 కోట్లతో షెడ్లు నిర్మించి, సాంచాలను కూడా అప్పగించి, సబ్సిడీతో లోన్లు ఇప్పించాలని ప్లాన్‌‌‌‌ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక షెడ్లను ఇతర పనులకు వాడుతోందని మండిపడ్డారు. 

సంక్రాంతిలోపు వర్కర్‌‌‌‌ టు ఓనర్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేయాలని, వచ్చే బడ్జెట్‌‌‌‌లో ఫండ్స్‌‌‌‌ కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో టెస్కాబ్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ కొండూరి రవీందర్‌‌‌‌రావు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు గుడూరి ప్రవీణ్, న్యాలకొండ అరుణ, జిందం చక్రపాణి పాల్గొన్నారు.