గండిపేట, వెలుగు: బండ్లగూడ జాగీర్ పీరం చెరువులోని దాసాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప మాలధారులకు 41 రోజుల పాటు నిర్వహించిన అన్నదానం బుధవారం ముగిసింది. మాజీ కార్పొరేటర్ నాగుల స్రవంతి నరేందర్ ఆధ్వర్యంలో నాలుగో ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గురువారం ముగింపు సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు, స్వాములను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాలధారులు బస్వరాజ్, యాదగిరి, సాయి, ఈశ్వరప్ప, సాంబశివ, శివ, దండ బాణీ, ధనుష్ పాల్గొన్నారు.
