ఆగిన విశ్వక్ సేన్- అర్జున్ మూవీ

ఆగిన విశ్వక్ సేన్- అర్జున్  మూవీ

విశ్వక్ సేన్‌‌ హీరోగా అర్జున్‌‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అర్జున్ కూతురు ఐశ్వర్య ఇందులో హీరోయిన్. షూటింగ్ విషయంలో హీరో విశ్వక్‌‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్‌‌ రావడంతో, తనతో ఇక సినిమా చేయనంటూ నిన్న అర్జున్‌‌ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. సినిమా డిస్కషన్స్‌‌ మొదలు ఫస్ట్ షెడ్యూల్‌‌ షూటింగ్ వరకూ రకరకాల కారణాలు చెప్పి విశ్వక్ రాలేదని, నవంబర్‌‌‌‌ 3 నుండి నెక్స్ట్ షెడ్యూల్‌‌కి ప్లాన్‌‌ చేస్తే తెల్లవారు ఝామున 4 గంటలకు షూటింగ్ క్యాన్సిల్‌‌ చేయమని విశ్వక్ నుండి మెసేజ్ వచ్చిందన్నారు అర్జున్.  ‘కథ, క్యారెక్టర్, డైలాగ్స్‌‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయినా ఎందుకిలా చేశాడనేది నాకర్థం కాలేదు.

ఇంత అన్‌‌ ప్రొఫెషనలిజమా.. నిజంగా ఇది దర్శకనిర్మాతలు, టెక్నీషియన్స్‌‌ను అవమానించడమే. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ పాటలు, సాయి మాధవ్ డైలాగ్స్ అతడికి నచ్చడం లేదు. హీరోగా సూచనలు చేయొచ్చు తప్పులేదు కానీ మేకర్‌‌‌‌గా నాకూ నచ్చాలి కదా. చాలాసార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశా. అతను వినలేదు. ఇదే ఇండస్ట్రీలో ఎంతోమంది నిబద్ధత గల నటులను చూశా. కానీ ఇతను మాత్రం రేపు షూటింగ్‌‌ అనగా క్యాన్సిల్‌‌ అని మెసేజ్‌‌లు పెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో సినిమా చేయదలచుకోలేదు. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్‌‌ గిల్డ్‌‌తోనూ మాట్లాడతాను. ఇలా మరొకరికి జరగకూడదు అన్నారు అర్జున్.