
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించిన ఈ మూవీ ఉగాది కానుకగా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. నటనతో పాటు నిర్మాణం, దర్శకత్వంలో చాలా నిజాయితీగా పని చేశాను. ప్రసన్న కుమార్ కథ చెప్పినప్పుడే అద్భుతమనిపించింది. డెవలప్ చేస్తూ వెళ్తుంటే దాని స్కేల్ పెరిగిపోయింది.
నివేదా కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఆమెకు స్టోరీ నచ్చడంతో నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మహేష్, హైపర్ ఆదితో పని చేస్తుంటే సరదాగా గడిచిపోయేది. లియోన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది. మా నాన్న నన్ను చాలా భరించారు. ఈ సినిమా ఆయనకి చాలా డబ్బులు తెచ్చిపెట్టాలి. ‘దాస్ కా ధమ్కీ’ నా జీవితాన్ని మారుస్తుందనుకుంటున్నా’ అన్నాడు. ‘ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. అందర్నీ అలరిస్తుంది’ అంది నివేదా. రైటర్ ప్రసన్నకుమార్, నిర్మాత కరాటే రాజు, మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ పాల్గొన్నారు.