
బషీర్బాగ్, వెలుగు: విశ్వకర్మ కులస్తులు రాజకీయంగా రాణించాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అధినేత విశ్వనాధుల పుష్పగిరి 450 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మలు, ఇతర బీసీ కులాలు గ్లోబలైజేషన్ కారణంగా వృత్తులు కోల్పోయి చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక శాతం జనాభా ఉన్న అగ్రకులాల సంపద పెరిగిపోతుందన్నారు. బీసీ ఉద్యమంలో విశ్వకర్మలు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథుల పుష్పగిరి, చామకూర రాజు, కేవీ గౌడ్, బత్తుల సిద్ధేశ్వరులు పటేల్, డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పాల్గొన్నారు.