విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది

విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది

విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బసిరెడ్డి రాన దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు.  ఫిల్మ్ నగర్ టెంపుల్‌‌‌‌‌‌‌‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌‌‌‌‌‌‌కి దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ క్లాప్ కొట్టారు. సుద్దాల అశోక్ తేజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి,  హైదరాబాద్, కర్నూలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపనున్నట్టు  దర్శక నిర్మాతలు చెప్పారు. సాక్షి రంగారావు కొడుకు శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే రివీల్ చేస్తామన్నారు.