ఘనంగా వీఐటీ–ఏపీ ‘యూనివర్సిటీ డే’

ఘనంగా వీఐటీ–ఏపీ ‘యూనివర్సిటీ డే’

అమరావతి: ఏపీ అమరావతిలోని వెల్లూర్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఆంధ్రప్రదేశ్ (వీఐటీ–ఏపీ) యూనివర్సిటీ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వీఐటీ–ఏపీ యూనివర్సిటీ ఐదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్సిటీ క్యాంపస్​లో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో యూనివర్సిటీ యాన్యువల్ రిపోర్ట్ ను చీఫ్ గెస్ట్​గా హాజరైన బాష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెచ్ఆర్ అధిపతి రాజ్ కుమార్ బోనం ఆవిష్కరించారు.

భవిష్యత్తులో ఆటోమోటివ్ పార్ట్స్​ను సాఫ్ట్​వేర్ ఆధారిత సొల్యూషన్సే 40% రీప్లేస్ చేస్తాయని ఆయన అన్నారు. ఈ రంగంలో బాష్ నుంచి కూడా త్వరలోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం వివిధ కేటగిరీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. ఐదేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వర్సిటీ స్టాఫ్ ను సన్మానించారు. కార్యక్రమంలో వీఐటీ ఫౌండర్, చాన్స్​లర్ జి. విశ్వనాథన్, యూనివర్సిటీ వీసీ ఎస్.వి. కోటరెడ్డి, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్ అనుపమ నంబూరు  పాల్గొన్నారు.