తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసమా? కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమా?: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసమా? కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమా?: వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ రాక్షస  పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.  ఏ కార్యక్రమం జరిగినా కేటీఆరే వెళ్లి శంకుస్థాపన చేస్తున్నారని.. పేపర్ లీక్ కేసులో కూడా కేటీఆరే బాధ్యత తీసుకోవాలని అన్నారు.  కేసీఆర్, కేటీఆర్.. వాళ్ల పైరవీ దారులకు ఉద్యోగాలు రావాలనే పేపర్ లీక్ చేశారని ఆరోపించారు. 30 లక్షల నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకుంది రాష్ట్ర ప్రజల కోసమా? కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమా? అని ప్రశ్నించారు.  నీళ్లు  కేసీఆర్ ఫామ్ హౌజ్ కు , నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్ కుటుంబ సభ్యులకు వెళ్లాయని విమర్శించారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్..  దేశంలోనే నంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి అని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ అవినీతి ముఖ్యమంత్రికి సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు.   ఇప్పటి వరకు మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శించారు.  నిరుద్యోగ భృతి ఇవ్వడానికి నిధులు లెవ్వు కానీ.. కాళేశ్వరం కాంట్రాక్టర్  మెఘా కృష్ణారెడ్డికి లక్ష కోట్లు దోచిపెట్టిండని ఆరోపించారు.