
సీఎం కేసీఆర్ తుగ్లక్ అని తన, కొడుకు కేటీఆర్, కూతురు కవితల కోసమే ఉద్యమకారులను, పార్టీ సీనియర్లను పక్కన పెడుతున్నారని అన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి. ఇందుకు ఉదాహరణ.. ఈటెల రాజేందర్, హరీష్ రావులేనని అన్నారు. పెద్దపల్లిలో మాట్లాడిన వివేక్… కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లను మొదట రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందిస్తానని కేసీఆర్ గతంలో మాటిచ్చారని గుర్తుచేశారు దీంతో పాటే.. 12టి.యం.సి.లతో ధర్మారం పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని తెలిపారని ఇప్పుడు దాని ఊసేలేదని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం ఈనెల 6వ తారీకున బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి చలో ధర్మారం కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పెరు చెప్పి సి.యం.కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు వివేక్. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుచెప్పి… కమీషన్ల కోసం ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పజెప్పారని తెలిపారు. దేశంలోనే తెలంగాణ ను సోలార్ రాష్ట్రంగా మారుస్తానని… లోకల్ కాంట్రాక్టర్లకు కాకుండా కమీషన్ల కోసమే వేరే రాష్ట్రాల నుండి అధిక ధరలకు విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.