కేసీఆర్ హయాంలో నిజాం పాలన : BJP

కేసీఆర్ హయాంలో నిజాం పాలన : BJP

కేసీఆర్ హయాంలో ఇంకా నిజాం పాలన కొనసాగుతుందన్నారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి. తుగ్లక్ లా వ్యవహరిస్తున్న కేసీఆర్… శిలాఫలకాల మీద తన పేరుండాలని ఆరాటపడుతున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఖిలాను ఎంపీ అరవింద్, మాజీఎంపీ జితేందర్ రెడ్డిలతో కలిసి సందర్శించారు వివేక్. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక కట్టాడాల సందర్శనలో భాగంగా… నిజాంలు దాశరథిని నిర్భందించిన జైలు గదిని నేతలు సందర్శించారు. దాశరథి గొప్పతనాన్ని తెలియజేసేలా నగరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

సెప్టెంబర్ 17ని విమోచన దినంగా జరపాలని డిమాండ్ చేశారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చి…ఇప్పుడు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ నిజాం కన్నా క్రూరంగా పాలిస్తున్నారని ఆరోపించారు మాజీఎంపీ జితేందర్ రెడ్డి. కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు ధిక్కరించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.