ఆదివాసీ సమస్యలపై గవర్నర్ ను కలిసిన వివేక్

ఆదివాసీ సమస్యలపై గవర్నర్ ను కలిసిన వివేక్

హైదరాబాద్: ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోషగూడెంకు చెందిన గిరిజన మహిళలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి... జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం బాధిత ఆదివాసీ మహిళలను వివేక్ వెంకటస్వామి గవర్నర్ తమిళిసై వద్దకు తీసుకెళ్లారు. అనంతరం వారికి జరిగిన అన్యాయాన్ని గురించి గవర్నర్ కు వివరించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... ఆదివాసీ మహిళలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని, వారిపై తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. ఆదివాసీ మహిళలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు కరువైందని మండిపడ్డారు. మహళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.