పైసా లేదన్న బాల్క సుమన్కు వెయ్యి కోట్లు ఎట్లొచ్చినయ్: వివేక్ వెంకటస్వామి

పైసా లేదన్న బాల్క సుమన్కు    వెయ్యి కోట్లు ఎట్లొచ్చినయ్: వివేక్ వెంకటస్వామి

ఉద్యమ సమయంలో పైసా లేదన్న బాల్క సుమన్  వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.  మందమర్రిలో వివేక్ వెంకటస్వామి ఇంటింటా ప్రచారం చేశారు.  ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. అవినీతి కేసీఆర్, బాల్కసుమన్ లకు  ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కమీషన్ల కోసమే బాల్కసుమన్  ఏపీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూరు  పొలాలు మునుగుతున్నా..బాల్క సుమన్ కు పట్టదన్నారు.  హస్తం గుర్తుకు ఓటేసి బాల్కసుమన్ ను ఇంటికి పంపించాలని కోరారు.

లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టినా ఎవరికీ ప్రయోజనం లేదన్నారు వివేక్ వెంకటస్వామి.  కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల జనం సొమ్ము వృథా చేశారన్నారు. సోనియా రాహుల్ కృషితోనే తెలంగాణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు.. కమీషన్లు దోచుకునేందుకే మిషన్ భగీరథ తెచ్చారని తెలిపారు.  మిషన్ భగీరథర పేరుతో 40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.   జనం సొమ్ము తిన్న కేసీఆర్ ను జైలుకు పంపించాలన్నారు.  తెలంగాణ సాధనలో తామేంతో కృషి చేశామన్నారు. కష్టకాలంలో ఉన్న సింగరేణి   సంస్థను కాపాడింది తమ నాన్నగారే అని చెప్పారు.