
ఈటల రాజేందర్ ప్రజల మంచి కోసమే ఆలోచిస్తాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. వీణవంక మండలం గంగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. ఈటల రాజేందర్ రాజీనామా వల్లే హుజురాబాద్ కు ఇన్ని పథకాలు వచ్చాయన్నారు. నాగార్జునసాగర్, హుజూర్ నగర్ లో ఇచ్చిన హామీలే ఇంకా నెరవేర్చలేదన్నారు. కానీ హుజురాబాద్ లో హామీలను కేసీఆర్ మెడలు వంచి ఈటల అమలు చేయిస్తారన్నారు. కేంద్రం రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయిస్తే కట్టలేదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే అవినీతి డబ్బులు తీసుకుని..ఈటల రాజేందర్ కు ఓటేయాలన్నారు. ఈటలపై ప్రేమను పోలింగ్ బూత్ లో చూపించాలని వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు.
మరిన్ని వార్తల కోసం