మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకర్లకు మెరుగులు: వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకర్లకు మెరుగులు:  వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్: మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకర్లకు మెరుగులు రుద్ది మభ్యపెట్టారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బాల్క్​సుమన్ పవర్ కట్ ఐతదన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ సమస్యలపై ప్రశ్నించిన ప్రజలపై బాల్క సుమన్ తప్పుడు కేసులు పెట్టి జైల్ కు పంపించిండు.

ఒక ఊళ్లోనే 25 మందిపై కేసులుపెట్టి వేధింపులకు దిగిండు. పోలీసులను వాడుకొని ప్రజలను ఇబ్బంది పెట్టిన ఆయనకు ఇక బయపడొద్దు. సుమన్ ను జైలుకు పంపించే కార్యక్రమం పెట్టుకోవాలి. ఇసుక వ్యాపారంలో ప్రభుత్వానికి కట్టే సొమ్ముతో ఊర్లు బాగుపడ్తాయి కానీ బాల్క సుమన్ జేబులో వేసుకున్నడు. రైతుల కోసం కొట్లాడితే నాకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ రోడ్డున పడేసిండు. బీఆర్ఎస్​ప్రభుత్వంలో పెన్షన్, రేషన్ కార్డ్స్ ఇస్తలేరు’ అని వివేక్​మండిపడ్డారు.