
మంచిర్యాల జిల్లా : జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరలో పాల్గొని పూజలు చేశారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు. చెన్నూర్ మండలం కతెరశాల శివాలయంలోనూ పూజలు చేశారు వివేక్ వెంకటస్వామి దంపతులు.
వేలాలగట్టు జాతర అభివృద్ది కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు రూ.కోటి 40 లక్షల నిధులు ఖర్చు చేశానని చెప్పారు వివేక్ వెంకట స్వామి. ఫారెస్ట్ పర్మిషన్ రాకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫారెస్ట్ అనుమతులు వచ్చేలా కృషి చేస్తా అని వివేక్ చెప్పారు.