హైదరాబాద్ జాతీయ స్థాయి పోటీలకు వేదికవ్వడం సంతోషం

 హైదరాబాద్ జాతీయ స్థాయి పోటీలకు వేదికవ్వడం సంతోషం

జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ వేదికవ్వడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచినవారికి మెడల్స్ అందించారు. తెలంగాణలో మొదటిసారి ఇంతపెద్ద పవర్ లిఫ్టింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ని అభినందించారు వివేక్. ఈ పోటీల్లో 26 రాష్ట్రాల నుంచి 6వందల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు ఆర్గనైజర్స్.

https://www.youtube.com/watch?v=LdmyGSQUWcM