త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా ద్వాపరయుగంలో శమీ పూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమని దేవి భాగవతం ద్వారా తెలుస్తుంది.
ద్వాపరయుగంలో పాండవులు జూదంలో ఓటమి చెందిన తరువాత దుర్యోధనుడి ఆదేశాలతో పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు పై దాచిపెట్టి విరాటరాజు కొలువుకు వెళ్లారని భాగవతం ద్వారా తెలుస్తుంది. అలా అజ్ఞాతవాసం ఏడాది కాలం పాటు ముగిసిన తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించారు పాండవులు.
కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడి తరువాత కీలకపాత్ర పోషించిన అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను పూజించిన వారికి విజయాన్నే అందిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత ఉంది.
ఆశ్వయుజమాసం శుక్లపక్షం విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక అంతర్యము కూడా ఇదేనని పండితులు చెబుతున్నారు. జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో విజయదశమి రోజు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
“ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు.
మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి బంగారం అనే పేరు వచ్చింది.
విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు, మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. త్రేతాయుగాన వనవాస సమయం లో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ALSO READ : దసరా రోజు.. జమ్మిచెట్టుకు పూజ.. పాలపిట్ట దర్శనం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!
విజయదశమి నాడు ప్రజలచే పూజలందుకుంటున్న మహిమాన్వితిమైన వృక్షంగా జమ్మిచెట్టును చెప్పవచ్చు. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టును నాటమని ప్రోత్సహిస్తోంది అంటే ఆ చెట్టుకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
