
‘‘2 టీఎంసీల నీటిని ఉపయోగించుకోలేని కేసీఆర్ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మూడో టీఎంసీ పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ కష్టమని ఇంజనీర్లే చెబుతున్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై వెంటనే విచారణ జరపాలి’’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.
రూ.లక్షా 27 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గత ఐదేండ్లలో మేడిగడ్డ నుంచి 1,100 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలని, కానీ అలా చేయలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల చెన్నూరు నియోజకవర్గంలోని రైతుల పంట భూములు, మంచిర్యాల పట్టణం కూడా మునుగుతున్నా కేసీఆర్ సర్కారు ఏనాడూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురవుతున్న రైతులను ఆదుకోవాలని, వచ్చే వర్షాకాలంలోగా వాళ్ల సమస్యను పరిష్కరించాలని మంత్రులకు వివేక్ విజ్ఞప్తి చేశారు.