ప్రతి గింజా కొంటానన్నారు..ఎక్కడ కొన్నారు?

ప్రతి గింజా కొంటానన్నారు..ఎక్కడ కొన్నారు?

జగిత్యాల/ పెద్దపల్లి, వెలుగు: ‘పండిన ప్రతి ధాన్యం గింజా కొంటామన్నరు. ఎక్కడ  కొంటున్నరు? సీఎం  చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నరు. మార్కెట్లలో కనీస సౌలతుల్లేక వడ్లన్నీ తడిసిపోతున్నయ్‌‌‌‌. వాళ్ల గోస చూస్తుంటే బాధేస్తోంది’ అని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటలో ధాన్యం కొనుగోలు సెంటర్‌‌‌‌ను ఆయన పరిశీలించారు. అకాల వర్షంతో ధాన్యం నష్టపోయిన  రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతు బాంధవుడిగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌‌‌‌.. రైతులకు శత్రువని, మాయమాటలతో మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఐకేసీ సెంటర్లలో అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్‌‌‌‌లో ప్రెస్‌‌‌‌మీట్లకే పరిమితమైన సీఎం.. రైతులను పట్టించుకోవడం మానేశారన్నారు. కమీషన్లు దొరికే కాళేశ్వరంపై దృష్టి పెట్టారని, 30 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని, పెంచిన 70 వేల కోట్ల భారాన్ని ప్రజల నుంచే పిండుకుంటారన్నారు. రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌‌‌‌.. ఆ హామీని గాలికొదిలారని, ప్రతిపక్షాలు గట్టిగా నిలదీయడంతో 25 శాతం మాఫీకి ఒప్పుకున్నారన్నారు.

జువ్వాడి కుటుంబానికి పరామర్శ

ధర్మపురి మండలం తిమ్మాపూర్‌‌‌‌లో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కుటుంబసభ్యులను వివేక్‌‌‌‌ పరామర్శించారు. అనంతరం గొల్లపల్లి మండలం రాఘవ పట్నంలో ఇటీవల మృతి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి  ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ను కలిశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు ఎండీ బషీర్, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి  కన్నం అంజయ్య, బీజేపీ మండలాధ్యక్షుడు తంగళపల్లి చక్రపాణి, జాడి రాజేశం, కొమ్ము రాంబాబు, గాజుల మల్లేశం, గుమ్ముల సతీష్, బైకాని రవీందర్ ఉన్నారు.

ఒకేసారి లక్ష మాఫీ చేయాలి

ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒకే సారి లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని, రైతు కూలీలకూ బీమా కల్పించాలని వివేక్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ యార్డులో  రైతులతో మాట్లాడారు. కొనుగోళ్ల విషయంలో సర్కారు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే  రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై  రైతుల కష్టాన్ని దోచుకుంటోందని వివేక్‌‌‌‌ విమర్శించారు. ప్రస్తుతానికి 20 నుంచి 30 శాతం ధాన్యాన్ని మాత్రమే కొన్నారని, అకాల వర్షాలు పడుతున్నందున మార్కెట్‌‌‌‌కు వచ్చిన ధాన్యాన్ని వెంటనే  కొనాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ సందర్భంగా హమాలీలు, రైతులకు మాస్కులను వివేక్‌‌‌‌ పంపిణీ చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కన్నం  అంజయ్య, కాడే సూర్యనారాయణతోపాటు పలువురు ఉన్నారు.

రాష్ట్రంలో రైతుల పొట్ట గొడుతున్నారు