యూకే లాంటి దేశాలను భారత్ ఓవర్ టేక్ చేసింది : వివేక్ వెంకటస్వామి

యూకే లాంటి దేశాలను భారత్ ఓవర్ టేక్ చేసింది : వివేక్ వెంకటస్వామి

ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కంట్రీలో భారత్ ఉందని  బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మూడు ట్రిలియన్ ఎకానమీతో భారత్ ఉందని చెప్పారు. యూకే లాంటి దేశాలను కూడా భారత్ ఓవర్ టేక్ చేసిందన్నారు.  ఇవాళ సుశీల్ కుమార్ మోడీ ఆధ్వర్యంలో  కేంద్ర బడ్జెట్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. బడ్జెట్ లోని ప్రధాన అంశాలపై  ఆయా రాష్ట్రాల్లో కేంద్రమంత్రి లేదా ఆ రాష్ట్ర సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. రైల్వే బడ్జెట్ లో కూడా ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు కేటాయించిందో వివరిస్తామన్నారు.  త్వరలోనే ఎవరు ఏ రాష్ట్రాలకు వెళ్లాలో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.