కేంద్రానిది ప్రజా సంక్షేమ పాలన: వివేక్ వెంకటస్వామి

కేంద్రానిది ప్రజా సంక్షేమ పాలన: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్ల నుంచి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తొమ్మిదేండ్ల మోడీ పరిపాలనపై గురువారం రాజమండ్రి పార్లమెంటు స్థానం పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో రివ్యూ మీటింగ్ కు వివేక్ వెంకటస్వామి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల్ దత్తు, పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు రలగే శ్రీదేవి, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ద్వారక తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని  వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు.