మిషన్ భగీరథ పెద్ద స్కాం: వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ పెద్ద స్కాం:  వివేక్ వెంకటస్వామి

మహిళలంటే కేసీఆర్ కు చిన్న చూపని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మహిళలను రక్షించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందన్నారు.  పోలీసులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజా పాలనను గాలికొదిలేసి కుటుంబ పాలన చేస్తున్నాడని విమర్శించారు . కేసీఆర్ కు ఆస్తులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. మహిళలకు రక్షణ రావాలంటే డబుల్ ఇంజిన్  సర్కార్ రావాలన్నారు.

పేరుకే పోలీసుల పెట్రోలింగ్ వెహికిల్స్ కానీ ..కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ కండువాలు వేసుకుని నేతల వెంట పెట్రోలింగ్ వాహనాలతో తిరుగుతున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలకు తప్ప సాధారణ ప్రజలకు  రక్షణ లేకుండా పోయిందన్నారు.  40 వేల కోట్లు ఖర్చు చేసినా ఇంటింటికి నీళ్లు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ స్కాం అని ఆరోపించారు.