కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలె .. బెల్లంపల్లిలో బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాక్​

కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలె .. బెల్లంపల్లిలో బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాక్​
  • హస్తం గూటికి ఆయా పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు
  • ఆహ్వానించిన వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్/చెన్నూరు/జైపూర్, వెలుగు: చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్​ అభ్యర్థులమైన తనను, అన్న గడ్డం వినోద్​ను గెలిపించాలని కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి ఓటర్లను కోరారు. ఆదివారం మందమర్రిలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్​లో చేరారు.

వీరికి మాజీ వివేక్, వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీజేపీకి చెందిన బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మునిమంద స్వరూప, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని రాజనర్సు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్ ఆయా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాసిపేట మండలంలోని బీఆర్ఎస్​, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. సోమగూడెంలో  పీఏసీఎస్​మాజీ చైర్మన్​వంశీధర్​రావు, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య, మాజీ ఎంపీటీసీ రాపర్తి శ్రీనివాస్​ఆధ్వర్యంలో 50 మంది సీనియర్​బీఆర్ఎస్​నాయకులు కాంగ్రెస్​లో చేరారు. 

క్యాతనపల్లి, మందమర్రి లీడర్లు చేరిక

చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన బీజేపీ టౌన్​ప్రెసిడెంట్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, జనరల్​సెక్రటరీ వేల్పుల సత్యనారాయణ ఆధ్వర్యంలో 50 మంది లీడర్లు, కార్యకర్తలు మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. మందమర్రికి చెందిన సీనియర్​కాంగ్రెస్, ఓడ్నాల శ్రీనివాస్, బీఆర్ఎస్​లీడర్లు సోత్కు సుదర్శన్, బండి సందానం, బీజేపీ లీడర్​గడ్డం శ్రీనివాస్​ఆధ్వర్యంలో ఆయా పార్టీల లీడర్లు, కార్యకర్తలు వందలాదిగా హస్తం పార్టీలో చేరారు.

భీమారం మండలంలో చేరికలు.. 

బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ చేకుర్తి సత్య నారాయణ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో మాజీ సర్పంచి ఎలుకటూరి శంకరమ్మ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పోటు భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బన్సిలాల్, కె.భాస్కర్ రెడ్డి, సీనియర్ లీడర్.పోడేటి రవి ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ కడారి మల్లేశ్వరి,మండల జడ్పీటీసీ భూక్య తిరుమల ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్​చార్జి సెడెం శెట్టి, రమేశ్, వార్డు మెంబర్ భూక్య శంకర్ నాయక్, కుర్సింగ పుష్పలత, ఇస్లావత్ గణేశ్, దసుర్ నాయక్, పెదం లక్ష్మి, కురసింగ రామక్క, ఆరేపల్లి లీడర్ అనపర్తి రమేశ్, మద్దికల్ మాజీ సర్పంచ్ డేగ రమేశ్, ఆకుదారి తిరుపతి, మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో 500 మంది మహిళలు, యువకులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

ALSO READ : 14 మందితో సీపీఎం లిస్ట్ .. మేనిఫెస్టో రిలీజ్ 

జైపూర్​మండలంలో...

జైపూర్ మండలం లోని బీఆర్ఎస్ పార్టీ కి చెందిన గంగిపల్లి, కిష్టాపూర్, వేలాల, రామారావు పేట, వెంకట్రావుపల్లి గ్రామాల సర్పంచ్ లు పాలమాకుల లింగారెడ్డి, చందుపట్ల పద్మజ, ప్యాగ శ్యామల, నామాల సత్యవతి,ఉండ్రాళ్ల లక్ష్మి, మాజీ జడ్పీటీసీ భర్త చల్ల సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, పౌనూర్ మాజీ సర్పంచ్​రామటెంకి సమ్మయ్య, గంగిపల్లి ఉప సర్పంచ్ నరెడ్ల రాజిరెడ్డి, వివిధ గ్రామాల్లోని వార్డు మెంబర్లు రజియా బేగం, మహేందర్ రెడ్డి, నరేడ్ల శ్రీనివాస్ రెడ్డి, పాలమాకుల అంజి రెడ్డి, కన్నయ్య, ఎనగందుల జ్యోత్స్న, నరేడ్ల వెంకట్ రెడ్డి, జనగామ చిన్నయ్య, మాజీ ఎంపీటీసీ, వైస్ ప్రెసిడెంట్ గుడేల్లి రాజి రెడ్డి, రిక్కుల వెంకట్ రెడ్డితో పాటు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.