గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన వై28ఎస్, వై28ఈ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో 50 ఎంపీ సోనీ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
వై28ఎస్ 4జీబీ+128జీబీ వేరియంట్‌కు రూ. 13,999, 6జీబీ+128జీబీ వేరియంట్‌కు రూ. 15,499, 8జీబీ+128జీబీ వేరియంట్‌కు రూ. 16,999. అయితే వివో వై28 ధర 4జీబీ+64జీబీకి రూ. 11,999. ఈ రెండు ఫోన్ల అమ్మకాలు మొదలయ్యాయి.