స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో V60e స్మార్ట్ ఫోన్ ఇవాళ ఇండియాలో లాంచ్ అయింది. లాంచ్ కు ముందు ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికీ మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుందని, 90W ఫ్లాష్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీని ప్యాక్ తో వస్తుందని పుకార్లు వినిపించాయి. అయితే లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫోన్ ఫీచర్స్ వెల్లడయ్యాయి.
Vivo V60e ధర: వివో V-సిరీస్ లైనప్‌లో వస్తున్న వివో V60e 5Gని ధర రూ. 29,999 నుండి ప్రారంభమై, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 200MP ప్రైమరీ కెమెరా, AIతో ఫోటోగ్రఫీ ఫీచర్స్, వాటర్ అండ్ డస్ట్ రిసిస్టెంట్ కోసం IP68 అలాగే IP69 రేటింగ్ పొందింది.
వివో V60e: ధర & వేరియంట్లు
8GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 29,999
8GB RAM + 256GB స్టోరేజ్ ధర : రూ. 31,999
12GB RAM + 256GB స్టోరేజ్ ధర : రూ. 33,999
కలర్ వేరియంట్లు: ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్
వివో V60e ఆఫర్లు: Vivo V60eని ఇవాళ్టి నుండి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అలాగే సెలెక్టెడ్ స్టోర్స్ ద్వారా అక్టోబర్ 10 నుండి సేల్స్ ఉంటాయి. HDFC, ICICI, Axis బ్యాంక్ (Amazonలో), SBI సహా సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI, ఒక సంవత్సరం ఫ్రీ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తుంది.
వివో V60e: స్పెసిఫికేషన్లు
డిస్ ప్లే : 6.77-అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో
RAM: 8GB & 12GB
స్టోరేజ్: 128GB అలాగే 256GB
బ్యాక్ కెమెరా: 200MP ప్రైమరీ సెన్సార్ + డెప్త్ సెన్సార్ కెమెరా
సెల్ఫీ కెమెరా: ఆటో ఫోకస్‌తో 50MP కెమెరా
బ్యాటరీ: 90W వైర్డ్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ
ప్రొటెక్షన్: IP68 & IP69 రేటింగ్‌లు, డైమండ్ షీల్డ్ గ్లాస్
ఆపరేటింగ్ సిస్టమ్: ఫన్‌టచ్ OS 15 (ఆండ్రాయిడ్ 15)
ఫోన్ బరువు: 190 గ్రాములు
