హైదరాబాద్, వెలుగు: వివో ఇండియా దేశీయ మార్కెట్లోకి వై21, వై11 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇవి 6,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తాయి. మిలిటరీ గ్రేడ్ మన్నికతో పాటు ఐపీ65 రేటింగ్ ఈ ఫోన్ల ప్రత్యేకత. వై21 5జీ ధర రూ.18,999 నుంచి ప్రారంభం కాగా, వై11 5జీ ధర రూ.14,999 గా ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగిన డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్, 50 ఎంపీ కెమెరా వంటి ప్రత్యేకతలు వీటి సొంతం. అన్ని ప్రముఖ ఈ– కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వై21, వై11 ఫోన్లు లభిస్తాయి.
