ఉక్రెయిన్పై యుద్ధాన్ని త్వరలో ముగిస్తాం:పుతిన్

ఉక్రెయిన్పై యుద్ధాన్ని త్వరలో ముగిస్తాం:పుతిన్

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. యుద్ధాన్ని వేగంగా ముగించేందుకు కష్టపడుతున్నామన్నారు. ఉక్రెయిన్ రష్యా వార్ ముగింపు దశకు వచ్చిందని అనుకుంటున్నట్లు చెప్పారు. ఏ సంక్షోభమైనా చర్చలతోనో లేక మరే విధంగానో ముగుస్తుందని..ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అది వారికే మంచిది అవుతుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ వ్యవస్థలను అమెరికా సమకూర్చడం, జెలెన్‌స్కీ పర్యటనపై స్పందించిన  పుతిన్‌.. రక్షణ కోసమే ఇతర దేశాల సాయం తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.  దీని వల్ల సంక్షోభం మరింత కాలం పాటు కొనసాగిస్తుందని హెచ్చరించారు. 

మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు...అమెరికాలో ఘన స్వాగతం లభించింది. దీనికి ముందు ఉక్రెయిన్ కు అమెరికా1.8 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక ఉత్పత్తులను అందించాలని నిర్ణయించింది.  అంతేకాకుండా క్షిపణి దాడులను తట్టుకునేలా  పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది.