పుతిన్‌ బ్లాక్ బెల్ట్ రద్దు చేసిన తైక్వాండో

పుతిన్‌ బ్లాక్ బెల్ట్ రద్దు చేసిన తైక్వాండో

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు ఆయ‌న బ్యాంకు ఖాతాల‌ను ఫ్రీజ్ చేస్తే.. క్రీడారంగం నుంచి పుతిన్‌కు వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన వ‌ర‌ల్డ్‌ తైక్వాండో ఫెడ‌రేష‌న్.. ర‌ష్యా అధ్య‌క్షుడి హోదాలో పుతిన్‌కు ఇచ్చిన గౌర‌వ తైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. 

ఉక్రెయిన్‌పై యుద్ధానికి పాల్పడుతున్న పుతిన్‌ ఇప్ప‌టికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవిని కోల్పోయారు. లేటెస్టుగా  బ్లాక్ బెల్ట్‌ను ర‌ద్దు చేసిన తైక్వాండో ఫెడ‌రేష‌న్‌.. ర‌ష్యాతో పాటు ఆ దేశానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న బెలార‌స్‌లోనూ ఇక‌పై ఎటువంటి తైక్వాండో ఈవెంట్‌లను నిర్వహించ‌బోమ‌ని  తేల్చిచెప్పింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఫెడ‌రేష‌న్ త‌న ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి