
వొడాఫోన్ ఐడియా మరియు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతో ముందుకొచ్చాయి. వోడాఫోన్ కొత్తగా రూ .447 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేయగా.. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ .247 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొత్త బెనిఫిట్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది.
వొడాఫోన్ యొక్క రూ. 447 ప్లాన్‌లో 50 జీబీ బల్క్ డేటా 60 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అంతేకాకుండా.. అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. వీటికి అదనంగా వొడాఫోన్ మూవీస్ & టీవీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. కాగా.. వొడాఫోన్ ఐడియా యొక్క రూ. 299 ప్లాన్ ద్వారా డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్‌ఓవర్ డేటా ప్రయోజనంతో పాటు 28 రోజుల పాటు 4 జీబీ రోజువారీ డేటాను కూడా వొడాఫోన్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత టాక్‌టైమ్‌తో అందుబాటులో ఉంటుంది.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) గతంలోనే విడుదల చేసిన రూ .247 ప్రీపెయిడ్ ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం.. 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.