వొడాఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడియాకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,40‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 కోట్లు

వొడాఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడియాకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి  రూ.5,40‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 కోట్లు

న్యూఢిల్లీ: రూ. 18 వేల కోట్ల విలువైన ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఓ) మొదలయ్యే ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కోట్లను  వొడాఫోన్ ఐడియా (వీ) సేకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూ గురువారం ఓపెన్ కానుంది. ఏప్రిల్ 22 న ముగుస్తుంది. షేరు ధర రూ.10–11.  పేటీఎం, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ తర్వాత వొడాఫోన్ ఐడియానే  యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ ఫండ్స్ సేకరించింది. 

జీక్యూజీ పార్టనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమర్జింగ్ మార్కెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిడిలిటీ, యూబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబుదాబి  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ, ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రూ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోర్గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాన్లీ, సిటీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లోబల్ మార్కెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐల  నుంచి, మోతీలాల్ ఓస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వంటి డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుంచి  ఈ ఫండ్స్ సేకరించింది.