హైదరాబాద్, వెలుగు: బల్దియా సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆదివారం గండిపేట చెరువు క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో సిటీలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు, ఔత్సాహికులు, ప్రజలు దాదాపు వందమంది వరకు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
వీరిలో ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగులు, క్వాల్కమ్ డైరెక్టర్ అజయ్ సేథి, ఏఎండీ సంస్థ సీనియర్ డైరెక్టర్ శ్రీనివాసన్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జతిన్, పలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, సీబీఐటీ, ఎంజీఐటీ విద్యాసంస్థల విద్యార్థులు, మై హోమ్ నవద్వీప లోని ఫ్యామిలీస్ ఉన్నాయి. వచ్చే రెండువారాలు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని మన చెరువులను రక్షించుకోవాలని ప్రతినిధులు కోరారు.
