
కొన్ని నియోజకవర్గాల్లో 5 నుంచి 14 % పెరుగుదల
నిజామాబాద్ లో అదనంగా 14.13%
సికిం ద్రాబాద్ లో అదనంగా7.06 %
గురువారం లెక్కలకు.. శుక్రవారం లెక్కలకు మధ్య వ్యత్యాసాలు
గేట్లు మూసేసిన తర్వాత అంత పెరుగుతుందా ?: బీజేపీ కిషన్ రెడ్డి
ఫైనల్ శాతాల ప్రకటనలో జాప్యమెందుకు చేశారు?: కాంగ్రెస్ నేత నిరంజన్
‘‘రాష్ట్ర వ్యాప్తం గా 60.57 పోలింగ్ శాతంనమోదైంది .. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుఉన్నారు. వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చాం”ఇదీ గురువారం సాయంత్రం 5 గంటలకుపోలింగ్ ముగియగానే ఈసీ చెప్పిన లెక్క.
‘‘సాయంత్రం 5 తర్వాత కూడా ఓటర్లు ఓటువేశారు. రాష్ట్రవ్యాప్తం గా మొత్తం 62.69 శాతంపోలింగ్ నమోదైంది ” ఇదీ శుక్రవారంసాయంత్రం 6 తర్వాత చెప్పి న ఫైనల్ లెక్క.
ఓవరాల్ గా పోలింగ్ లెక్కలో 2.21 శాతమే తేడా ఉంది. నిజానికిది పెద్ద ఎక్కువేం కాదు.అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం భారీతేడాలు కనిపిస్తున్నాయని, దీనిపై అనుమానాలున్నాయని ప్రతిపక్షాలుఆరోపిస్తున్నాయి.
సికింద్రాబాద్ లో గురువారం సాయంత్రం 5 గంటలవరకు 39.20 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పిన అధికారులు.. శుక్రవారం సాయంత్రం మాత్రం అది46.29 శాతంగా వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఇంత ఎక్కువ పోలింగ్ ఎలా నమోదవుతుందని స్థానిక బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూడు నాలుగు నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం తర్వాత పోలింగ్ శాతం పెరిగినట్లు ఎన్నికల అధికారుల ఫైనల్ లెక్కలు బట్టి తెలుస్తోంది. సాధారణంగాఎన్నికల్లో సాయంత్రం తర్వాత తక్కువగా పోలింగ్ శాతం రికార్డవుతుంది.
దాదాపు అంతటా అట్లనే..
గురువారం సాయంత్రం ప్రకటించిన పోలిం గ్శాతానికి.. శుక్రవారం సాయంత్రం 6గంటల తర్వాతప్రకటించిన ఫైనల్ పోలింగ్ శాతానికి భారీ తేడాలు కనిపిస్తున్నాయి నిజామాబాద్‌లో అత్యధికంగా14.13 శాతం పోలింగ్ తేడా ఉంది. అయితే ఇక్కడ సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. అయినప్పటికీ ఇంతఅధికంగా పెరగడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ తర్వాత మహబూబాబాద్‌లో 8.89 శాతం,నల్గొండలో 8 శాతం, సికింద్రాబాద్‌లో 7.06 శాతం, ఖమ్మంలో 7.32 శాతం, పెద్దపల్లిలో 6.19 శాతంచొప్పున పోలింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. చేవెళ్లలోమాత్రం పోలింగ్ 0.58 శాతం తగ్గడం గమనార్హం. ఇక్కడ గురువారం సాయంత్రం 5 గంటలదాకా 53.80 శాతం నమోదవగా, శుక్రవారం లెక్కల్లోమాత్రం 53.22 శాతంగా అధికారులు ప్రకటించారు.
ఎక్కువ శాతం సాధ్యమేనా?
ఎన్నికల్లో సాయంత్రం తర్వాత సాధారణంగా రెండునుంచి నాలుగు శాతం మాత్రమే పోలిం గ్ పెరిగేఅవకాశాలు ఉంటా యి. ప్రస్తుతం లెక్కల ప్రకారంనాలుగైదు ఎంపీ స్థా నాలు మినహా అన్నింట్ లో 5నుంచి 14 శాతం వరకు పోలిం గ్ పెరిగిం ది. ఇంతఎక్కు వ పెరగడం ఎలా సాధ్యమౌతుందని ప్రతిపక్షా-లు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 19,68,147 మందిఓటర్లు ఉన్నారు. ఇందులో 10,24,917 మందిపురుషులు, 9,43,171 మంది స్త్రీలు, 59 మందిఇతర ఓటర్లు. ఇక్కడ గురువారం సాయంత్రం ఐదుగంటలకు 39.20% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలఅధికారులు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రంమాత్రం మొత్తంగా 46.26 శాతం పోలింగ్ నమోదైన-ట్లు తెలిపారు. అంటే 7.06 శాతం పెరిగింది. మొత్తంఓట్లలో 46.26 శాతం అంటే సుమారుగా 91,0,464ఓట్లు పోలైనట్లు లెక్కగట్టవచ్చు. అదేవిధంగా పెరిగిన7.06 శాతం అంటే 1,37,770 ఓట్లు పడినట్లుఅంచనా. ఇక్కడ సుమారు 1800 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండగా, చివరి గంటలో ఒక్కో కేంద్రంలోసగటున 76 ఓట్లు పోలై ఉండవచ్చు. అయితే 5గంటల తర్వాత చాలా పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యం గా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కు వగా ఓటర్లుకనిపించారు. ‘‘సికింద్రాబాద్ పరిధిలో గురువారంసాయంత్రం ఐదు తర్వాత ఏ పోలింగ్ కేంద్రంలోనూ20- నుంచి 30 మంది ఓటర్లు కనిపించలేదు. కొన్నిపోలిం గ్ కేంద్రాలైతే నిర్మానుష్యం గా ఉన్నాయి” అనిఓ పార్టీ కీలక నేత అన్నారు. ఒక ఓటరు ఓటేయడా-నికి సుమారు రెండు నుంచి మూడు నిమిషాలపా-టు సమయం ఉంటుం ది. అయితే ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక్క గంటలోనే 76 మంది ఓటేయడానికిఏట్ల సాధ్యమవుతుందని సదరు నేత ప్రశ్నిం చారు.
ఖమ్మంలో అత్యధికం.. హైదరాబాద్‌లో అత్యల్పం
రాష్ట్రంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్ని కల్లోఖమ్మం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా 75.28 పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 44.75 శాతం నమోదైంది. లోక్‌సభ స్థానాల్లో నమోదైన తుది పోలింగ్ పర్సంటేజీని సీఈవోరజత్‌కు మార్ శుక్రవారం సాయంత్రం వెల్లడిం చారు.