ఇకపై బ్యాలెట్ పేపర్లు ఉండవు: సునీల్ అరోరా

ఇకపై బ్యాలెట్ పేపర్లు ఉండవు: సునీల్ అరోరా

ఎన్నికల నిర్వహణ కోసం గతంలో బ్యాలెట్ పేపర్లు ఉపయోగించేవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. వాటి స్థానంలో EVMలు వచ్చాయి. ఎన్నికలు జరిగిన తర్వాత గంటల్లో ఫలితాలు వస్తుండటంతో వాటినే ఉపయోగిస్తున్నారు. దీంతో బ్యాలెట్‌ పత్రాలు ఇక చరిత్రగా మిగిలిపోతాయని..వాటితో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదన్నారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) సునీల్‌ అరోరా.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారులతో, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు CEC సునీల్‌ అరోరా. కొన్ని రాజకీయ పార్టీల నేతలు బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారని, అది సాధ్యం కాదని చెప్పామన్నారు. అది ఇకపై చరిత్రేనని ఆయన అన్నారు. EVMలు సరిగ్గా పని చేయకపోవచ్చునేమో కాని.. వాటిని ట్యాంపర్‌ చేయడం మాత్రం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.