మొరాయిస్తున్న ఈవీఎంలు.. పలు ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్

మొరాయిస్తున్న ఈవీఎంలు.. పలు ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సూర్యాపేట బూత్ నెంబర్ 89, బాసర 262 బూత్, మెదక్ జిల్లా ఎల్లాపూర్, కరీంనగర్ లో 371వ నంబర్ బూత్ లో ఈవీఎంలు పని చేయట్లేదు. ఓటు వేసేందుకు జనాలు క్యూ కట్టారు. కాగా ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యమవుతోంది.

జగిత్యాల జిల్లాలో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ స్టేషన్ 39 నంబర్ ధర్మపురిలో ఈవీఎం మొరాయించింది. దీంతో 20 నిమిషాలు అలస్యంగా ఓటింగ్ ప్రారంభం అయింది.

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 87 వ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయిస్తున్నాయి. మిషన్ ను సరి చేసే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.. దీంతో ఓటర్లు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో రెండూ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. తాళ్లపేట 1 పోలింగ్ బూత్ వద్ద మాకులపేట్ 5 పోల్లింగ్ బూత్ వద్ద  ఈవీఎంలు మొరాయించాయి. 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండల హైదర్ షాకోట్ ప్రభుత్వ పాఠశాలలో బూత్ నెంబర్ 89లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు.

మహబూబాబాద్ జిల్లాబయ్యారం హైస్కూల్ లో 33  పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. 45 నిమిషాలు దాటిన అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటర్లు క్యూలో భారీగా నిలబడ్డారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బూతు నెంబర్ 169 లో ఈవీఎం మొరాయించింది. ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. దీంతో క్యూలైన్ లో ఉన్న ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.