తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది : సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది  : సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుందన్నారు  సీఈఓ వికాస్ రాజ్.  ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ జరుగుతుందని తెలిపారు.   కొన్ని చోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు వచ్చాయని,  వాటిని సాల్వ్ చేస్తున్నామన్నారు. కొత్త ఓటర్లు యువత ఓటు వేయడానికి రావాలని పిలుపునిచ్చారు.. బూత్ ఎక్కడుంది అనేది యాప్ లో  తెలుసుకోండి లొకేషన్ తో పాటు ఉంటుందని చెప్పారు. ఈ సారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందన్నారు వికాస్ రాజ్.  

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుంది.  ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం  5 గంటల వరకు జరగనుంది.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు ప్రజలు.

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.. జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ లో కుటుంబంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. జూబ్లీహిల్స్ లో హీరో అల్లు అర్జున్, ఎస్‍ఆర్ నగర్‍లో నటుడు ప్రకాష్ రాజ్, జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్‍లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, మణికొండలో ఓటు వేశారు దగ్గుబాటి వెంకటేష్.