24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె
  • 23వేల మంది వీఆర్ఏలు సమ్మె చేపట్టి 24 రోజులైనా స్పందించడం లేదు

రాజన్న సిరిసిల్ల జిల్లా:  వేమువాడ రెవెన్యూ డివిజనల్  ఆఫీసు (ఆర్డీవో) ముందు వీఆర్ఏలు ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ 300 మంది వీఆర్ఏలు ధర్నా చేశారు. తమకు పే స్కేలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న 23 వేల మంది వీఆర్ఏలు సమ్మె చేపట్టి 24రోజులు అవుతోందన్నారు. సమ్మెలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగాఅన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

సీఎం ఇచ్చిన హామీ అమలు కోసం 24 రోజులుగా సమ్మె చేస్తున్నా కనీస స్పందన లేదని ఈ సందర్భంగా వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపడతామని వీఆర్ఏలు ప్రకటించారు.