పాకిస్తాన్ సెమీస్‌‌‌‌ ఆశలు సజీవం

పాకిస్తాన్ సెమీస్‌‌‌‌ ఆశలు సజీవం
  • కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై పాకిస్తాన్ గెలుపు
  • చెలరేగిన షాదాబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌, షాహిన్‌‌‌‌ ఆఫ్రిది 

సిడ్నీ: టీ 20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో సెమీస్‌‌‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండా లంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ దుమ్ము రేపింది. వర్షం అంతరాయం కలిగించినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సూపర్‌‌‌‌–12లో గ్రాండ్‌‌‌‌ విక్టరీ సాధించింది. షాదాబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (22 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52; 2/16) తోడుగా ఇఫ్తికార్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) చెలరేగడంతో గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌–2 లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌ 33 రన్స్‌‌‌‌ తేడాతో (డక్‌‌‌‌వర్త్‌‌‌‌ లూయిస్‌‌‌‌) సౌతాఫ్రికాను ఓడించింది. టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాకిస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 185/9 స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌‌‌‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టార్గెట్‌‌‌‌ను 14 ఓవర్లలో 142గా సవరించారు. దీన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు ఓవర్లన్నీ ఆడి108/9 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌‌‌‌ బవుమా (19 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 36) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. షాదాబ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

వర్షం దెబ్బ..

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆరంభం కలిసి రాలేదు. షాహిన్‌‌‌‌ ఆఫ్రిది (3/14) తన తొలి రెండు ఓవర్లలో డికాక్‌‌‌‌ (0), రోసో (7)ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. 16/2 స్కోరుతో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌‌‌ను బవుమా (36), మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (20) మూడో వికెట్‌‌‌‌కు 49 రన్స్‌‌‌‌ జోడించి నిలబెట్టారు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో 48/2 స్కోరు చేసిన సఫారీలు 9 ఓవర్లకు 69/4 స్కోరుతో నిలిచారు. ఈ దశలో వర్షం పడటంతో ఇన్నింగ్స్‌‌‌‌కు అంతరాయం కలిగింది. ఆట మొదలైన తర్వాత సౌతాఫ్రికా టార్గెట్‌‌‌‌ను 14 ఓవర్లకు కుదించారు. దీంతో ఆఖరి ఐదు ఓవర్లలో 73 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో క్లాసెన్‌‌‌‌ (15), స్టబ్స్‌‌‌‌ (18) బ్యాట్లు ఝుళిపించే ప్రయత్నం చేశారు. కానీ పాక్‌‌‌‌ పేసర్లు ఆఫ్రిది, నసీమ్‌‌‌‌ (1/19), వసీమ్‌‌‌‌ (1/13) సమయోచితంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో ప్రొటీస్‌‌‌‌ ఓవర్‌‌‌‌కు ఓ వికెట్‌‌‌‌ను కోల్పోయింది. పార్నెల్‌‌‌‌ (3), రబాడ (1), నోర్జ్‌‌‌‌ (1) ఫెయిల్‌‌‌‌ కావడంతో టార్గెట్‌‌‌‌ను అందుకోలేకపోయారు. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌‌‌‌: 20 ఓవర్లలో 185/9 (ఇఫ్తికార్‌‌‌‌ 51, షాదాబ్‌‌‌‌ 52, నోర్జ్‌‌‌‌ 4/41), సౌతాఫ్రికా: 14 ఓవర్లలో 108/9 (బవుమా 36, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ 20, ఆఫ్రిది 3/14, షాదాబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 2/16).

‘టాప్‌‌‌‌‌‌’ ఫెయిల్‌‌‌‌..

పాక్‌‌‌‌ను సఫారీ పేసర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. నాలుగో బాల్‌‌‌‌కే రిజ్వాన్‌‌‌‌ (4) ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చారు. కానీ బాబర్‌‌‌‌ (6), హారిస్‌‌‌‌ (28) కాసేపు పోరాడారు. ఐదో ఓవర్‌‌‌‌లో హారిస్‌‌‌‌ను నోర్జ్‌‌‌‌ (4/41) ఎల్బీగా  ఔట్​ చేశాడు. ఆ వెంటనే బాబర్‌‌‌‌, షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌ (2) కూడా పెవిలియన్‌‌‌‌కు చేరారు. దీంతో 38/1తో ఉన్న స్కోరు రెండు ఓవర్ల వ్యవధిలో 43/4గా మారింది. ఈ దశలో ఇఫ్తికార్‌‌‌‌ యాంకర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడగా, మహ్మద్‌‌‌‌ నవాజ్‌‌‌‌ (28) ఫర్వాలేదనిపించాడు. అయితే 13 ఓవర్లలో 95/5 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన షాదాబ్‌‌‌‌.. సఫారీ బౌలర్లపై వీరవిహారం చేశాడు.  నాలుగు భారీ సిక్సర్లు కొట్టి 20 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు.  కానీ 19వ ఓవర్‌‌‌‌లో నోర్జ్‌‌‌‌.. వరుస బాల్స్‌‌‌‌లో షాదాబ్‌‌‌‌,   వసీమ్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు. నసీమ్‌‌‌‌ షా (5 నాటౌట్‌‌‌‌), హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ (3) విఫలమైనా... ఆరో వికెట్‌‌‌‌కు ఇఫ్తికార్‌‌‌‌, షాదాబ్‌‌‌‌ 82 రన్స్‌‌‌‌ జోడించడంతో భారీ స్కోరు సాధ్యమైంది.